Abn logo
Jul 29 2021 @ 02:01AM

ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఎన్‌హెచ్‌ నిర్మాణం : సీపీఐ

మీడియాతో మాట్లాడుతున్న నారాయణ

తిరుపతి రూరల్‌, జూలై 28:చిత్తూరు నుం చి తచ్చూరు వరకూ చేపట్టిన జాతీయ రహ దారి నిర్మాణం ప్రజాభి ప్రాయానికి భిన్నంగా ఉందని సీపీఐ జాతీ య కార్యదర్శి  నారా యణ అభిప్రాయపడ్డా రు. తిరుపతిలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం గ్రామ సభలు నిర్వహించకుండా, బాధిత రైతుల అభిప్రాయాలను పరిగణ నలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు దిగుతోందన్నారు. అందుకే చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టామన్నారు.8 మండలాలకు చెందిన 600మంది రైతులు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపడితే కనీసం కలెక్టర్‌ వినతిపత్రం స్వీకరించడానికి కూడా రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. జాతీయ రహదారుల చట్టం ప్రకారం బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జాతీయ రహదారికి సహకరించకపోతే రేషన్‌ కార్డు, పెన్షన్‌ రద్దు చేస్తామంటూ అధికారులు బాధితులను భయపెడుతున్నారని ఆరోపించారు. ఆగస్టు 5 నుంచీ 12వ తేదీ దాకా బాధిత గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామని తెలిపారు. నష్ట పరిహారం ఇస్తేనే జాతీయ రహదారి నిర్మించాలనీ, లేకపోతే రైతుల శవాలపై జాతీయ రహదారి వేయాల్సి వస్తుందని హెచ్చరిం చారు.జిల్లాలో మామిడి రైతుల గోడు పట్టించుకునేవాడే కరువయ్యాడని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు  మండిపడ్డారు. రూ. 40 కోట్లు సబ్సిడీ పొందిన గుజ్జు ఫ్యాక్టరీల యాజమాన్యాలు మామిడి రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.ఇప్పటికైనా మామిడి రైతులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలన్నారు. చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారి పరిధిలో వున్న ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు బాధిత ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తారో, వ్యక్తిగత పర్సంటేజీలకు పరిమితమవుతారో చూస్తామని తెలిపారు. హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ మదనపల్లెలో వచ్చే నెల తొలివారంలో సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మురళి, తిరుపతి నగర కార్యదర్శి విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.