Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తాం

కొత్తపేట-రావులపాలెం రోడ్డులో మందపల్లి వద్ద రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

 పెంచిన రేట్లతోనే టెండర్లు
ముందుకు రాకపోతే పనులు మేమే పూర్తిచేస్తాం
కొత్తపేట-రావులపాలెం రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి శ్రీకారం

కొత్తపేట, డిసెంబరు 2: కొత్తపేట-రావులపాలెం రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. మందపల్లి వద్ద పనులను లాంఛనంగా ప్రారంభించారు. కాంట్రాక్టర్ల సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకువెళ్లి రూ.172 కోట్ల పాత బకాయిలు విడుదల చేయించామన్నారు. పెంచిన రేట్లతోనే టెండర్లు పిలిచారని, ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకు రావాలన్నారు. కొత్తపేట-రావులపాలెం రోడ్డుకు ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచామన్నారు. నవంబరులో పెంచిన రేట్లతో రూ.8.20 కోట్లతో టెండర్లు పిలిచి గత నెల 26వ తేదీ వరకు టెండర్‌ కాలపరిమితి ఉన్నప్పటికీ టెండరు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. దాని సమయాన్ని ఈ నెల 8 వరకు పెంచామని, ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకు రావాలన్నారు. ఈలోపు ప్రయాణికుల అవస్థల దృష్ట్యా తానే దగ్గరుండి ముందుగా పనులు ప్రారంభించానన్నారు. మానవతా దృక్పథంతో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొని పనులు పూర్తిచేయాలన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో పలు రోడ్లకు నిధులు మంజూరయ్యాయని, వాటికి కూడా టెండర్లు పిలిచామన్నారు.

Advertisement
Advertisement