Abn logo
Sep 26 2021 @ 00:58AM

కొనసాగిన ‘వైకుంఠం’ వర్గీయుల ఆత్మీయ బాట

వెంకటరాముడును పరామర్శిస్తున్న గంపన్న, రమణ, మారుతి తదితరులు


అనంతపురం వైద్యం, సెప్టెంబరు 25: నగరం లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గీయుల ఆత్మీయ పలకరింపు కొనసాగింది.  టీడీపీ సీనియర్‌ నాయకులు మడ్డిపల్లి వెంకటరాముడు ఇంటికి శనివారం చౌదరి వర్గం నాయకులు సాకే గంపన్న, సరిపూటి రమణ, మారుతి కుమార్‌గౌడ్‌, మురళి, ముక్తియార్‌, గుర్రం నాగభూషణ, గోపాల్‌గౌడ్‌, కాకర్ల ఆది, మార్కెట్‌ మహేశ, నిట్కాన చంద్ర, నరసింహులు తదితరులు వెళ్లారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కోసం అందరం కలిసి పనిచేద్దామని కోరారు.