Abn logo
Jul 11 2020 @ 11:24AM

ఎయిర్‌పోర్టులో కాంటాక్ట్‌లెస్‌ కార్‌ పార్కింగ్‌

శంషాబాద్‌రూరల్ ‌(రంగారెడ్డి) : రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి కాంటాక్ట్‌ లెస్‌ పార్కింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసు కొచ్చినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పాయి. దేశంలోనే 100శాతం కాంటాక్ట్‌ లెస్‌ పార్కింగ్‌ విధానం అందిస్తున్న ఏకైక ఎయిర్‌పోర్టు తమదేనని వెల్లడించాయి. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సహకారంతో ఫాస్టాగ్‌ కారు పార్కింగ్‌ను ఎన్‌ఈటీసీ (నేషనల్‌ కలెక్షన్‌ ఎలకా్ట్రనిక్‌ టోల్‌ కలెక్షన్‌) జారీచేసిన బ్యాంకులతో అను సంధానం చేసింది. ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఎక్కడా తాకకుండా విమానాల్లోకి ప్రవేశించవచ్చని తెలిపారు. ప్రయాణికులు ఫాస్టాగ్‌తో నేరుగా కారు పార్కింగ్‌లో పెట్టి విమానాశ్రయంలోకి వెళ్లొచ్చని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. 

Advertisement
Advertisement