Abn logo
Sep 25 2020 @ 04:53AM

సకాలంలో రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తి చేయాలి

Kaakateeya

-జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌


నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సకాలంలో రైతు వేదిక నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ సంబంధిత సర్పంచ్‌లు, అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ మండలంలోని నల్లవెల్లి, నాగనూల్‌, వనపట్ల, మంతటి, పెద్దముద్దునూర్‌, పులిజాల, చందాయపల్లి గ్రామాలలో నిర్మిస్తున్న రైతువేదికలను గురువారం ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ.22లక్షల వ్యయంతో ప్రతి క్లస్టర్‌లో రైతుల ఉపయోగార్థం ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. రైతువేదిక నిర్మాణ పురోగతి వివరాలను అధికారులను అడిగి కలెక్టర్‌ తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలో రైతు వేదికలను పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను పకడ్బందీగా తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.    చందాయపల్లి, పెద్దముద్దునూర్‌ గ్రామాల సర్పంచ్‌లకు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్‌ వెంట మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement