Abn logo
Aug 4 2020 @ 01:47AM

రామమందిర నిర్మాణం కోసం..

  • రూ.7.8 లక్షలు కూడబెట్టిన ఎమ్మెల్యే తల్లి


బెంగళూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని ఎంతగానో ఆకాంక్షించి తన తల్లి జీవితకాలంలో రూ.7.8 లక్షలు కూడబెట్టిందని కర్ణాటక రాష్ట్రం మైసూరు బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌ఏ రామదాస్‌ వెల్లడించారు. మైసూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరాన్ని చూడాలని పరితపించిన తమ మాతృమూర్తి ఆ కోరిక నెరవేరకుండానే తనువు చాలించారని తెలిపారు. ఆమె మృతి చెందిన తర్వాత ఆ హుండీలో గత నాలుగేళ్లుగా తాము కూడా నగదు వేస్తూ వచ్చామని.. ఆ హుండీలోని డబ్బులను లెక్కించగా రూ.7.8 లక్షలు ఉన్నట్లు తెలిసిందన్నారు. కరోనా తగ్గిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లి ఈ మొత్తాన్ని రామజన్మభూమి ట్రస్టుకు అప్పగిస్తామని ప్రకటించారు.

Advertisement
Advertisement
Advertisement