Abn logo
Oct 23 2020 @ 04:51AM

200 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం

ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌ 


తలకొండపల్లి : ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా తలకొండపల్లి మండలంలో 200 మంది నిరుపేద కు టుంబాలు ఇళ్లు నిర్మించుకునేందుకు చేయూతనందించినట్లు ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌ వెల్లడించారు. వాటిలో 105 ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి కాగా మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. తలకొండపల్లి మండలం పెద్దూర్‌ తండా, పకడల్‌ గ్రామాల్లో ట్రస్ట్‌ ద్వారా ఐదు నిరుపేద కుటుంబాలకు నిర్మించిన ఇళ్లను గురువారం ఎంపీపీ నిర్మలాశ్రీశైలంగౌడ్‌, వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి ఉప్పల వెంకటేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ దశాబ్దాలుగా గ్రామీ ణ ప్రాంతాల్లో అనేక పేద కుటుంబాలు సొంతిల్లు లేక దుర్భర జీవితాలు వెళ్లదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడా ఇళ్ల నిర్మాణంలో సహకరించడం లేదని దీంతో తమ ట్రస్ట్‌ ద్వారా వారికి చేయూతనందించి ఇళ్ల నిర్మాణాలు చేయిస్తున్నట్లు చెప్పారు.


విజయ దశమి రోజు పేద కుటుంబాలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని పూర్తయిన ఇళ్లను గృహ ప్రవేశం చేసి అప్పగించినట్లు తెలిపారు. ట్రస్ట్‌ ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో సుమారు 450 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు వివరించారు. 4,500 కరోనా కిట్లను  బాధితులకు ఉచితంగా అందించడం తో పాటు ఉపాధికి ఇబ్బంది పడుతున్న వేలాది కుటుంబాలకు చేయూతనందింంచినట్లు తెలిపారు. అధికార పార్టీ నేతలు ప్రచారాలను పక్కన బెట్టి ప్రజాసమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రఘుపతి, శ్రీశైలం, గోపాల్‌ నాయక్‌, లలితాజోతయ్య, ఎంపీటీసీలు రమేశ్‌, రఘు, సోని లక్య, బుచ్చిబాబు, శేఖర్‌యాదవ్‌, దేవులా నాయక్‌, బొజ్జయాదయ్య, శ్రీశైలం గౌడ్‌, గోపాల్‌ నాయక్‌ ఉన్నారు.

Advertisement
Advertisement