Abn logo
Sep 25 2020 @ 04:46AM

వేదికలు.. వేగిరం

Kaakateeya

- ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న రైతు వేదికల నిర్మాణాలు

- వనపర్తి జిల్లాలో 71 క్లస్టర్ల పరిధిలో చకచకా పనులు

- అక్టోబర్‌ 10 కల్లా పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకున్న అధికారులు

- పంచాయతీ పాలక వర్గాలను భాగస్వామ్యం చేసిన సర్కారు

- రూ.15.62 కోట్లతో అంచనా వ్యయం

- రాష్ట్రంలోనే వనపర్తిని నంబర్‌ వన్‌గా నిలుపుతాం : కలెక్టర్‌


రైతులను సంఘటిత శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాలను చేపడుతోంది.. ఇందులో భాగంగా ప్రతి వ్యవసాయ క్లస్టర్‌కు ఒక రైతు వేదికను మంజూరు చేసింది.. ఒక్కో రైతు వేదికను రూ.22 లక్షల వ్యయంతో నిర్మిస్తుండగా, మొత్తం వనపర్తి జిల్లాలోని 71 నిర్మాణాలకు గాను రూ.15.62 కోట్లు ఖర్చు చేస్తోంది.. పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా 54, ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా 17 నిర్మాణాలను చేపడుతుండగా, ఇందులో పంచాయతీ పాలక వర్గాలను కూడా భాగస్వామ్యం చేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.. అన్నింటికీ గ్రౌండింగ్‌ పూర్తి కాగా, అక్టోబర్‌ 10వ తేదీ నాటికి నిర్మాణాలను పూర్తి చేయాలని అధికార యంత్రాంగం సంకల్పం పెట్టుకున్నది.. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా కూడా ప్రత్యేక శ్రద్ధతో పనుల పూర్తి కోసం కృషి చేస్తున్నారు..


వనపర్తి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : పంట కాలనీలు, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు విషయంలో కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి పూనుకుంది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో మొత్తం 71 వ్యవసాయ క్లస్టర్లకు రైతు వేదికల నిర్మాణాలను ప్రారంభించింది. పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయి,. వనపర్తి మండలంలో ఏడు రైతు వేదికల నిర్మాణానికి రూ.1.54 కోట్ల అంచనాతో శంకుస్థాపన చేయగా, మూడింటి పనులు చివరి దశలో ఉన్నాయి. రూప్‌ లెవల్‌లో ఒకటి, గోడలు లేచి రెండు, బేస్మెంట్‌ లెవల్‌లో ఒకటి ఉంది. పెబ్బేరులో ఆరు వేదికల నిర్మాణానికి రూ.1.32 కోట్లతో ప్రారంభించగా, మూడు బేస్మెంట్‌ లెవల్‌లో, ఒకటి గోడలు లేచి, రెండు రూఫ్‌ లెవల్‌లో ఉన్నాయి. శ్రీరంగాపూర్‌ మండలంలో మూడు నిర్మాణాలను రూ.66 లక్షలతో ప్రారంభించగా, రెండు బేస్మెంట్‌ లెవల్‌, ఒకటి రూఫ్‌ లెవల్‌లో ఉన్నాయి. గోపాల్‌పేట మండలంలో ఆరు నిర్మాణాలను రూ.1.32 కోట్లతో ప్రారంభించగా, రెండు గోడలు లేచిన దశలో, మూడు రూఫ్‌ లెవల్‌లో, ఒకటి చివరి దశలో ఉన్నాయి. పెద్దమందడి మండలంలో ఆరు నిర్మాణాలను రూ.1.32 కోట్లతో ప్రారంభించగా, ఆరు గోడలు లేచిన దశలో ఉన్నాయి. కొత్తకోటలో ఐదు నిర్మాణాలను రూ.1.10 కోట్లతో ప్రారంభించగా, రెండు రూఫ్‌ లెవల్‌లో, మూడు చివరి దశలో ఉన్నాయి. ఆత్మకూరు మండలంలో మూడు నిర్మాణాలను రూ.66 లక్షల అంచనాతో ప్రారంభించగా, ఒకటి రూఫ్‌ లెవల్‌లో, రెండు చివరి దశలో ఉన్నాయి. పానగల్‌ మండలంలో ఐదు నిర్మాణాలను రూ.1.10 కోట్లతో ప్రారంభించగా, ఒకటి బేస్మెంట్‌ లెవల్‌, రెండు గోడలు లేచిన దశలో, రెండు రూఫ్‌ లెవల్‌లో, ఒకటి చివరి దశలో ఉన్నాయి.


వీపనగండ్ల మండలంలో ఆరు నిర్మాణాలను రూ.1.32 కోట్లతో ప్రారంభించగా, మూడు బేస్మెంట్‌ లెవల్‌లో, రెండు గోడలు లేచిన దశలో, ఒకటి రూఫ్‌ లెవల్‌లో ఉన్నాయి. చిన్నంబావి మండలంలో ఏడు నిర్మాణాలను రూ.1.54 కోట్లతో ప్రారంభించగా, రెండు బేస్మెంట్‌ లెవల్‌లో, నాలుగు గోడలు లేచిన దశలో, ఒకటి రూఫ్‌ లెవల్‌లో ఉన్నాయి. రేవల్లి మండలంలో నాలుగు నిర్మాణాలను రూ.88 లక్షలతో ప్రారంభించగా, రెండు బేస్మెంట్‌ లెవల్‌లో, రెండు రూఫ్‌ లెవల్‌లో ఉన్నాయి. ఖిల్లాఘణపురం మండలంలో ఏడు నిర్మాణాలను రూ.1.54 కోట్లతో ప్రారంభించగా, రెండు బేస్మెంట్‌ లెవల్‌లో, మూడు గోడలు లేచిన దశలో, రెండు రూఫ్‌ లెవల్‌లో ఉన్నాయి. మదనాపూర్‌ మండలంలో మూడు నిర్మాణాలను రూ.66 లక్షలతో ప్రారంభించగా, రెండు బేస్మెంట్‌ లెవల్‌లో, ఒకటి రూఫ్‌ లెవల్‌లో ఉన్నాయి. అమరచింత మండలంలో మూడు నిర్మాణాలను రూ.66 లక్షలతో ప్రారంభించగా, రెండు బేస్మెంట్‌ లెవల్‌లో, ఒకటి రూఫ్‌ లెవల్‌లో ఉన్నాయి. మొత్తం 15.62 కోట్ల అంచనా వ్యయానికి గాను ఇప్పటి వరకు రూ.2.91 కోట్లను ఖర్చు చేశారు. ఇదిలా ఉండగా, వేగంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల క్యూరింగ్‌ సరిగా జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. క్యూరింగ్‌ సరిగా కాకుంటే త్వరగా పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది.


వనపర్తిని నంబర్‌ వన్‌గా నిలుపుతాం

జిల్లాలో 71 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, అన్నింటిలో ఇప్పటికే నిర్మాణాలను గ్రౌండింగ్‌ చేశాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించడంతో ఆ దిశగా పని చేస్తున్నాం. అక్టోబర్‌ మొదటి వారంలో అన్ని నిర్మాణాలను పూర్తి చేసి, వనపర్తిని నంబర్‌ వన్‌ స్థానంలో ఉంచుతాం.

షేక్‌ యాస్మిన్‌ బాషా, కలెక్టర్‌, వనపర్తి

Advertisement
Advertisement
Advertisement