Abn logo
Sep 30 2020 @ 05:14AM

ఆలయ సమీపంలో శ్మశానవాటిక నిర్మాణమా?

Kaakateeya

గ్రామస్థుల ఆందోళన పనుల నిలిపివేత


బుక్కరాయసముద్రం, సెప్టెంబరు 29: ఆంజనేయస్వామి ఆలయానికి అతి సమీపంలో శ్మశానవాటికను నిర్మించటంపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఒక్కసారిగా గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేశారు. బుక్కరాయసముద్రం చెరువు కట్టపై కొవిడ్‌ శ్మశాన వాటిక నిర్మాణాన్ని చేపట్టేందుకు అనంతపురం నగర పాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. 777 సర్వే నెంబర్‌ ముసలమ్మ కట్ట వద్ద ఉన్న అంజనేయస్వామి దేవాలయం వెనుక 3.50 ఎకరాల్లో కొవిడ్‌ మృతులకు దహన సంస్కారాలు, శ్మశానవాటిక ఏర్పాటుకు స్థలాన్ని అధికారులు గుర్తించారు. రూ.78లక్షల వ్యయంతో టెండర్‌ పూర్తి చేసి, పనులు ప్రారంభించేందుకు తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా శ్మశానవాటిక నిర్మాణం ఎలా చేపడతారని మంగళవారం వారు అందోళన చేపట్టారు.


దీంతో చేసేదిలేక నిర్మాణపు పనులను తాత్కాలికంగా నిలిపివేసి, కాంట్రాక్టర్‌ను వెనక్కి పంపేశారు. అధ్యాత్మికంగా అభివృద్ధి చేయాల్సిన ప్రదేశంలో శ్మశాన ఘాట్లు ఏర్పాటు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డపద్మావతి, ఉన్నతవిద్య, పర్యవేక్షణ, సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముసలమ్మ దేవత గ్రామ ప్రజలు కోసం ఆత్మార్పణం చేశారనీ, అలాంటి స్థలంలో శ్మశాన వాటిక ఎలా ఏర్పాటు చేస్తారటూఊ వారు ప్రశ్నించారు.

Advertisement
Advertisement
Advertisement