Abn logo
Aug 25 2021 @ 17:00PM

కానిస్టేబుళ్ల బీరు సీసా ఫైటింగ్

పశ్చిమ గోదావరి: తాము సమాజానికి రక్షణ కల్పించే ఉద్యోగాల్లో ఉన్నామని మరచిపోయి ఇద్దరు కానిస్టేబుల్స్ బీరు సీసాలతో కొట్టుకున్నారు. జిల్లాలోని కాళ్ల మండలం జువ్వలపాలెంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ బీరు సీసాలతో కొట్టుకున్నారు. కానిస్టేబుల్స్ సుబ్బారావు, మురళి ఆకివీడు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.  ఒకరిపై ఒకరు  పీఎస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

క్రైమ్ మరిన్ని...