Abn logo
Oct 22 2021 @ 19:04PM

గల్లీ, ఢిల్లీలో బీజేపీ, టీఆర్ఎస్ దోస్తులే: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

హుజురాబాద్: గల్లీలోనే కాకుండా ఢిల్లీలో కూడా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దోస్తులేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆరోపించారు. హుజురాబాద్‌లో ఉప ఎన్నికల సందర్భంగా శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడారు. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికతపై మాట్లాడే అర్హత మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు. "నీది సిరిసిల్లనా.. అక్కడ నువ్వు స్థానికుడివేనా" అని కేటీఆర్‌ను శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం వల్లే సిరిసిల్లలో కేటీఆర్ గెలిచాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ది సిద్దిపేట కదా, మరి మహబూబ్ నగర్, కరీంనగర్ ఎంపీగా పోటీ చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. దళిత బంధుపై బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని శ్రీధర్‌బాబు ఆరోపించారు.  


ఇవి కూడా చదవండిImage Caption