Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుల బాధలు పట్టని టీఆర్ఎస్, బీజేపీ: VH

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పంట కుప్పలపై చనిపోతుంటే... టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎంపీ వీహెచ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్‌ఎస్, బీజేపీలకు రైతుల బాధలు పట్టడం లేదన్నారు. రైతు చట్టాలపై కేసీఆర్ ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఏం సాధించారని పర్యటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని... వాటి గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, కోటి ఉద్యోగాలు అని మోదీ చెప్పారని... వాటి గురించి ఎందుకు మాట్లాడరని అన్నారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుచేవారని... ఈటల గెలుపులో బీజేపీ ప్రమేయం ఏమీ లేదని తెలిపారు. కేసీఆర్‌కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే డిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే తాము కూడా పాల్గొంటామని తెలిపారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో రైతు వ్యతిరేక చట్టాలపై కాంగ్రెస్ సమావేశాలను బైకాట్ చేయాలన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీలో నేతలంతా విభేదాలు వీడి పనిచేయాలని వీహెచ్ సూచించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement