Abn logo
Sep 25 2021 @ 13:19PM

తెలంగాణలో బెల్ట్ షాపులను సర్కారే ప్రోత్సహిస్తోంది: సునీతా

హైదరాబాద్: రాష్ట్రంలో బెల్ట్ షాపులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ బెల్ట్ షాపులను నిరోధించాల్సిన పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలపై దాడులు చేస్తున్నారన్నారు. బెల్ట్ షాపులపై మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దాడులు జరుపుతామని తెలిపారు. జరుగుతున్న ఆగడాలపై మహిళా మంత్రులు మాట్లాడరని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రుల బినామీలు పబ్‌లు, క్లబ్‌లు నడుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యపానం, గంజాయి, డ్రగ్స్ ముఠాలు రాజ్యమేలుతున్నాయన్నారు. స్వయంగా మంత్రులే గుట్కాలు తింటున్నారని తెలిపారు. జరుగుతున్న ఆగడాలపై ఫిర్యాదులు చేద్దామంటే సీఎం, మంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వరన్నారు. గవర్నర్‌ను కలుద్దామంటే అపాయింట్మెంట్ దొరకదని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేటుకి రాష్ట్ర క్యాబినెట్ బాధ్యత వహించాలని సునీతా రావు డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption