Aug 3 2021 @ 21:48PM

అజిత్‌ తదుపరి చిత్రాన్ని నిర్మించేదెవరు?

స్టార్‌ హీరో అజిత్‌ వరుస ప్రాజెక్టులు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘వలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్‌ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా అజిత్‌ 61వ చిత్రాన్ని కూడా బోనీ కపూరే నిర్మిస్తారని, హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తారనేలా ఈ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అజిత్ తదుపరి చిత్రాన్ని కూడా హెచ్‌. వినోదే దర్శకత్వం వహించనున్నాడు కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుందనేలా వార్తలు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా, సత్యజ్యోతి నిర్మాణ సంస్థ ప్రస్తుతం ధనుష్‌ హీరోగా ‘మారన్‌’  చిత్రంతో పాటు ‘శివకుమారియిన్‌ శపథం’ అనే చిత్రాలను నిర్మిస్తుంది.

Otherwoodsమరిన్ని...