Abn logo
Oct 15 2021 @ 00:03AM

టీయూలో అయోమయం!


నియామకాలు చేపట్టలేదన్న వీసీ
ఆందోళనలో అభ్యర్థులు

డిచ్‌పల్లి, అక్టోబరు 14:  తెలంగాణ విశ్వవిద్యాలయంలో నెల రోజులుగా ఔట్‌ సోర్సింగ్‌ సి బ్బంది అక్రమ నియామకాలపై అ యోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా నిబం ధనలకు విరుద్ధంగా జరిగిన నియామ కాలు చివరికి రద్దు అవుతాయని ప్రచా రం సాగుతోంది. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం వర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా తాము ఇంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టలేదని కేవలం తాత్కాలిక పద్ధతిలో భవి ష్యత్తు అవసరాల కోసం ఇంటర్వ్యూలు చేశారని, ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కొత్తగా నియామకమైన ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది తమ నియామకాలు ఉంటాయో ఊడుతా యోనని భయాందోళన చెందుతున్నారు. విశ్వవిద్యాల యంలో పాలకమండలి సమావేశం పది రోజుల్లో నిర్వ హించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యమండలి చైర్మన్‌ లింబాద్రి రిజిస్ట్రార్‌గా సేవలు అందించడంతో పాటు యూనివర్సిటీ సేవల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో ఈ సమస్యలు మరింత జఠిలం కాకముందే ఇటీవల కమిటీని పంపినట్లు తెలుస్తోంది.