Abn logo
May 23 2020 @ 04:12AM

సాగుపై సర్వసభ్య సమావేశం తీర్మానం

స్పందించని 21 మంది అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు


పదర, మే 22: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలనుసారం వ్యవసాయంలో శాస్త్రీయమార్పులను అందిపుచ్చుకునేలా రైతులు చెప్పిన పంటలు వేసుకునేలా ప్రోత్సహించాలని శుక్రవారం ఎంపీపీ బిక్యానాయక్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎంపీ రాములు సాగుపై తీర్మానం చేయించారు. మిషన్‌ భగీరథ పైపులైన్‌ 15రోజుల్లో క్లియర్‌ చేయాలని ఆశాఖ అధికారులకు తెలిపారు. గ్రామాల్లో డొంక రోడ్లు, నక్షబాటలను ఉపాధి పనుల్లో చేయించాలని సర్పంచ్‌లకు తెలిపారు.


ఉన్న 30 మంది ఉద్యోగుల్లో కేవలం 9 మంది ఉద్యోగులే ఈ సమావేశానికి స్పందించారని ఆగ్రహించారు. స్పందించని 21 మంది అధికారులపై తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపాలన్నారు. మళ్లీ రెండు నెలల్లో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, జడ్పీ చైర్మన్‌ పద్మావతి, జడ్పీటీసీ రాంబాబు, విండో డైరెక్టర్‌ శంకర్‌, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement