Abn logo
Oct 14 2021 @ 00:29AM

ఇంటర్వ్యూలు వాయిదా వేయడంపై ఆందోళన

లింగంపేట ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు

లింగంపేట, అక్టోబరు 13: లింగంపేట మండల పరిషత్తు కార్యాలయం ముందు బుధవారం గిరిజన నిరుద్యోగులు ఆందోళన చేశారు.  మండలంలో ఎస్టీ కార్పొరేషన్‌ రుణాల కోసం 12 యూనిట్లకు గాను 163 మంది నిరు ద్యో గులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. వారికి ఈనెల 13న బుధవారం 10 గంటలకు ఇంటర్వూలు నిర్వహిస్తున్నామని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఎంపీడీవో కార్యాలయం నుంచి నిరుద్యోగులకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో నిరుద్యోగులు బతుకమ్మ పండుగ అయినప్పటికీ, పనులు ఉన్నా లెక్క చేయకుండా మారుమూల తండాల నుంచి మహిళలు సైతం ఇంటర్వ్యూలకు తరలిరాగా 12 గంటలకు ఈ రోజు ఇంటర్వ్యూలను వాయిదా వేశామని ఇంట ర్వ్యూలను ఎప్పుడు నిర్వహించేది తరువాత తెలియజేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు ఎంపీడీవో శంకర్‌సింగ్‌ తీరుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీ వో కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దీనిపై ఎంపీడీవోను వివరణ కోరగా జడ్పీటీసీ వాయిదా వేయమన్నారని అందుకే వాయిదా వేసినట్లు తెలి పారు. దీనిపై జడ్పీటీసీని వివరణ కోరగా ఇంటర్వ్యూలు ఉన్న విషయమే తనకు తెలియదని ఆయన తెలిపారు. ఇంటర్వ్యూలను వాయిదా వేసినందుకు రవాణా ఖర్చులను అధికారులు చెల్లించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆందోళన చేసిన వారిలో దారావత్‌ గంగారాం, సంగమేశ్వర్‌, రవీందర్‌, అన్షీ, లావణ్యలతో పాటు నిరుద్యోగులు ఉన్నారు.