Advertisement
Advertisement
Abn logo
Advertisement

కీలక నిర్ణయం: ఇక నుంచి..

పీజీ కోర్సులన్నింటికీ కామన్‌ క్యాలెండర్‌

ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం

ఈ ఏడాది నుంచే అమలు13న వర్సిటీలతో భేటీ


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): అడ్మిషన్ల నుంచి పరీక్షల నిర్వహణ వరకు.. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులన్నింటికీ ఈ ఏడాది నుంచే ఉమ్మడి విద్యా క్యాలెండర్‌ను అమలు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. డిగ్రీ తరహాలోనే రాష్ట్రంలోని 6 యూనివర్సిటీలకు ఈ క్యాలెండర్‌ రూపొందిస్తారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వైస్‌చాన్స్‌లర్లతో మంగళవారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అధ్యక్షతన నిర్వహించారు. పూర్తి స్థాయిలో చర్చించి, క్యాలెండర్‌ను రూపొందించడం కోసం 13న మరో సమావేశం నిర్వహించనున్నారు.


యూనివర్సిటీల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఓయూలో ‘సహాయం’ పేరుతో హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తుండగా, అన్ని యూనివర్సిటీల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి కరోనా వ్యాక్సిన్లు వేయించేలా అధికారులు చొరవ తీసుకుంటారు. యూనివర్సిటీలు, కాలేజీలు న్యాక్‌ గుర్తింపు పొందేందుకు ఈ ఏడాది ప్రయత్నించాలని నిర్ణయించారు. డిగ్రీలో 88 ప్రభుత్వ కాలేజీలు న్యాక్‌ గుర్తింపు పొందగా, మిగతా కాలేజీలు గుర్తింపు పొందేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. న్యాక్‌ గుర్తింపు కోసం సన్నద్ధమయ్యే కాలేజీలకు రూ.లక్ష గ్రాంట్‌ ఇవ్వనున్నట్లు లింబాద్రి తెలిపారు.

Advertisement
Advertisement