Advertisement
Advertisement
Abn logo
Advertisement

కమర్షియల్‌ గ్యాస్‌ ధర పైపైకి

తాజాగా సిలిండర్‌పై రూ.98.50 పెరుగుదల

ప్రస్తుతం  ధర రూ.2198.50

లబోదిబోమంటున్న ఫాస్ట్‌ఫుడ్‌, బేకరీ, హోటళ్ల యజమానులు


మడకశిర అర్బన, డిసెంబరు 2: కమర్షియల్‌ గ్యాస్‌సిలెండర్‌ ధరలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఒక వైపు  కిరాణాషాపులలో సరకుల ధరలు చుక్కలనంటున్నాయి. మరో వైపు గ్యాస్‌ ధరలు కూడా పెరిగిపోతుండడంతో నిర్వాహణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.2100లున్న కమర్షియల్‌ సిలెండర్‌ ధర తాజాగా రూ.98.50 పెరిగింది. పెరిగిన ధరతో కలిపి మడకశిరలో ప్రస్తుతం సిలెండర్‌ ధర రూ.2198.50లుగా ఉంది. పెరుగుతున్న సరకులు, గ్యాస్‌ ధరల కారణంగా విధిలేని పరిస్థితుల్లో తాము కూడా ధరలు పెంచాల్సి వస్తోందని హోటళ్లు, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌ సెంబర్ల నిర్వాహకులు అంటున్నారు. తాము ధరలు పెంచడంతో వ్యాపారాలు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. హోటళ్ల బాడుగలు, పనిచేసే వారికి కూలి మరింత భారంగా మారాయని వాపోతున్నారు. అరకొరగా సాగతుఉన్న వ్యాపారం నిర్వహణ ఖర్చులకే సరిపోతోందని, కుటుంబ పోషణ ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని నిత్యావసర, గ్యాస్‌ధరలను తగ్గించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


Advertisement
Advertisement