Abn logo
Jan 18 2021 @ 00:29AM

‘కలెక్టర్‌, ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు తగదు’


కర్నూలు(న్యూసిటీ), జనవరి 17: కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన  కులసంఘాల నాయకులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని  ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ  సభ్యుడు  ఈ. కిరణ్‌ కుమార్‌ డిమాం డ్‌ చేశారు. ఆదివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కిరణ్‌ మాట్లాడుతూ జిల్లా అధికారులపై  అనుచిత వ్యాఖ్యలుచేసిన కులసంఘాల  నాయకులు  బాలసుందరం, పట్నం రాజేశ్వరి, త్యాగరాజులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.  


అధికారుల జేఏసీకి మద్దతు 

కలెక్టర్‌ జి.వీరపాండియన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కుల సంఘాల నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సంఘం జేఏసీకి పంచాయతీరాజ్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదివారం జిల్లా పరిషత్‌ ఆవరణలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఈఓఆర్‌డీ అసోసియేషన్‌ అసోసియేట్‌ అధ్యక్షుడు రఘునాథ్‌, పీఆర్‌ ఇంజనీర్స్‌ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు కే.మల్లికార్జునమూర్తి, గౌస్‌బాషా, పంచాయతీ కార్యదర్శులు సంఘం రాష్ట్ర నాయకుడు హేమంత్‌కుమార్‌రెడ్డి, పీఆర్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ జడ్పీ యూనిట్‌ అధ్యక్షుడు సి.రాంగోపాల్‌, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కలాం, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం అసోసియేషన్‌ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ  కలెక్టర్‌పై బాలసుందరం,పట్నం రాజేశ్వరి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.  

  

Advertisement
Advertisement
Advertisement