Abn logo
Jul 9 2020 @ 05:31AM

పర్యావరణాన్ని పరిరక్షించండి

కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా


ఆత్మకూర్‌ / అమరచింత, జూలై 8 : మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా సూచించారు. బుధవారం ఆమె ఆత్మకూర్‌, అమరచింత మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మకూర్‌ మునిసిపాలిటీని సందర్శించారు. శ్మశావాటిక, డంపింగ్‌యార్డులను సందర్శించారు. ఆత్మకూర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని పుర చైర్‌ పర్సన్‌ గాయత్రి రవికుమార్‌, కమిషనర్‌ కృష్ణయ్యకు కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అశ్వనీకుమార్‌, రామకృష్ణ, మహేశ్వరి, యాదమ్మ, నాగలక్ష్మీరెడ్డి తదితరులు ఉన్నారు. అదేవిధంగా అమరచింత మునిసిపాలిటీలో మహిళా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి కలెక్టర్‌ భూమిపూజ చేశారు.


జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోని పాత బస్టాండ్‌లో వీటి నిర్మాణానికి కొందరు యువకులు ఆటంకం కల్గించేందుకు ప్రయత్నం చేయగా, కలెక్టర్‌ స్పందిస్తూ ప్రభుత్వ భూముల్లో ఎక్కడైనా ప్రజలకు అవసరమయ్యే పనులు చేసేందుకు ఆదేశాలున్నాయని అవగాహన కల్పించారు. అనంతరం యూనియన్‌ బ్యాంక్‌ ముందు కలెక్టర్‌ మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నదీమ్‌ అహ్మద్‌, పుర కమిషనర్‌ జె.కె.మోహన్‌, చైర్‌ పర్సన్‌ మంగమ్మ, వైస్‌ చైర్మన్‌ జి.ఎస్‌.గోపి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement