Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్రమత్తంగా ఉండండి!

  • జిల్లాలో విస్తారంగా వర్షాలు.. వరి కోతలొద్దు : కలెక్టర్‌ హరికిరణ్‌ సమీక్ష

కాకినాడ సిటీ, డిసెంబరు 1: అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై కలెక్టర్‌ హరికిరణ్‌ జేసీలు సుమిత్‌కుమార్‌, ఎ.భార్గవ్‌తేజలతో కలిసి వర్చువల్‌ విధానంలో ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు, ఆర్‌డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తుఫాను నేపఽథ్యంలో మండల ప్రత్యేక అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వ యం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో వ్యవసాయ పంట కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రానున్న నాలుగు రోజులపాటు రైతులు పంట కోతలు వాయిదా వేసుకునే విధంగా చూడడంతో పాటు ఇప్పటికే పంట కోసి రైతుల కళ్లాల వద్ద ఉన్న ఽధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు వేగవంతం చేసి రైసుమిల్లులకు తరలించే విఽధంగా చూడాలన్నారు. అలాగే ఇన్‌ ఫుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ అందించేందుకు పంట నష్టం వివరాల సేకరణ వేగవంతం చేయాలన్నారు. డీఆర్‌వో సీహెచ్‌.సత్తిబాబు, డీఎంహెచ్‌వో కేవీఎస్‌ గౌరీశ్వరరావు, సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ ఈ.లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో పి.ప్రసాదరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement