Abn logo
Aug 2 2021 @ 00:47AM

కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియను వేగవంతం చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

  • కలెక్టర్‌ హరికిరణ్‌

కాకినాడ సిటీ, ఆగస్టు 1: జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియను వేగవంతం చేయాలని, అందుబాటులో ఉన్న డోసుల మేరకు సచివాలయాల వారీగా లబ్ధిదారులను గుర్తించి టీకా పంపిణీ చేయాలని కలెక్టర్‌ చేవూరి హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కలెక్టరేట్‌ కోర్టు హాలులో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొవిడ్‌ పరిస్థితి, వైరస్‌ కట్టడి కార్యాచరణ, ఆసుపత్రుల్లో వసతుల కల్పనలో తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, మూడో వేవ్‌ సన్నద్ధతపై సమీక్షించారు. తొలుత జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో నమోదవుతున్న కేసులు, పాజిటివిటీ ట్రెండ్‌, కొవిడ్‌ కేసుల మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తదితర అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ టీకా డోసుల లభ్యతను బట్టి వీలైనంత త్వరగా 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నారు. రెండు, మూడు రోజుల్లో 90 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. తొలుత రెండో డోస్‌ లబ్ధిదారులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం మొదటి డోస్‌ లబిఽ్ధదారులకు పంపిణీ చేయాలన్నారు. మూడో వేవ్‌ సన్నద్ధతలో భాగంగా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థలను ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని కలెక్టర్‌ సూచించారు. ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న దాదాపు 1,400 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల పనితీరును పరిశీలించి, ఏమైనా మరమ్మతులు అవసరమైతే  వెంటనే చేపట్టాలన్నారు. కొవిడ్‌ ఆసుపత్రులపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా ట్రాన్సిట్‌ ఆసుపత్రుల ఏర్పాటుపై పరిశీలన చేయాలన్నారు. ప్రధానంగా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు తదితర ప్రాంతాల నుంచి విదేశాలకు రాకపోకలు సాగించే వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించి వీసా వ్యాలిడిటీ ఆధారంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో కేవీఎస్‌ గౌరీశ్వరరావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌.మహాలక్ష్మి, ఇన్‌చార్జి డీఎస్‌వో నాగభూషణం, డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌కిషోర్‌, కాకినాడ ల్యాబ్‌ ఉన్నతాధికారి మేర్తి, డీఐవో భరతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.