Abn logo
Jul 11 2020 @ 04:34AM

సీఎంఆర్‌ బియ్యాన్ని వెంటనే అందజేయాలి

 కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు 


వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, జులై 10:వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, జులై 10: ఖరీఫ్‌ కాలానికి రైస్‌మిల్లులకు కేటాయించిన సీఎంఆర్‌ బియ్యాన్ని వెంటనే అందజేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సివిల్‌ సప్లయీస్‌ అధికారులు, రైస్‌ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైస్‌ మిల్లులకు కేటాయించిన బియ్యంలో ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లరు అప్పజెప్పకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని మిల్లర్లు బియ్యాన్ని అందజేయాలన్నారు. 

Advertisement
Advertisement