Abn logo
Oct 23 2020 @ 05:00AM

జిల్లాలో కరోనా రెండో దశ

Kaakateeya

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్‌ నివాస్‌


కలెక్టరేట్‌, అక్టోబరు 22: జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి ప్రారంభమైందని కలెక్టర్‌ నివాస్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణపై జిల్లా పరిషత్‌ సమావేశ మంది రంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని ప్రజలు అలసత్వం వహిస్తున్నారని, ఇది మంచిది కాదని హితవుపలికారు. వర్షాకాలం, చలికాలంలో వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. జేసీ కె.శ్రీనివాసులు మాట్లా డుతూ, జిల్లాలో కరో నా పూర్తిగా అదుపులోకి రాలేదన్నారు.  ప్రజలు తప్పనిసరిగా మాస్కు, ఫేస్‌షీల్డ్‌లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. నో మాస్క్‌-నో ఎంట్రీ నినాదం పాటించాలని చెప్పారు.  చేతులను త రచూ సబ్బుతో గాని, శానిటైజర్‌తో గాని శుభ్రం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌,  రవాణా శాఖ ఉప కమిషనర్‌ వి.సుందర్‌, తదితరులు పాల్గొన్నారు.


నిబంధనలు పాటించాలి

ఆమదాలవలస: ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని  తహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు, మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ తెలిపారు. పట్టణంలోని పలు దుకాణాలను వారు గురువారం పరిశీలించారు. మాస్కు లేకుండా వచ్చేవారికి సరుకులు విక్రయించవద్దని ఆదేశించారు. కార్యక్రమంలో మేనేజర్‌ బి.మురళీమోహన్‌ పట్నాయిక్‌, మున్సిపల్‌ ఆర్‌ఐ హరీష్‌, సర్వేయర్‌ బి.గోవిందరావు పాల్గొన్నారు. పాలకొండ : కొవిడ్‌ నిబంధనలు వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని నగరపాలక కమిషనర్‌ బీఎం శివప్రసాద్‌ అన్నారు. గురువారం నగరంలోని వర్తక సంఘాలతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించకుంటే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


మాస్క్‌ తప్పనిసరి 

ఇచ్ఛాపురం: ప్రతిఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ఉపయోగించి కరోనా వ్యాప్తిని నివారించాలని మునిసిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి అన్నారు. గురువారం పట్టణ పరిధిలో గల అన్ని షాపులవద్దకు అధికారులు, సచివాలయ ఉద్యోగులు వెళ్లి నోమాస్క్‌ - నో ఎంట్రీ బోర్డులు పెట్టించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement