Abn logo
Oct 21 2021 @ 00:11AM

ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల దరఖాస్తులను పరిష్కరించాలి

కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశాలు

గుంటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హత ఉన్న వారికి పట్టాలు మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బెల్లంకొండలోని శ్రీరామాంజనేయపురంలో నివసిస్తోన్న గిరిజనులకు అంగన్‌వాడి కేంద్రం, ఎలిమెంటరీ స్కూలు, అంతర్గత రహదారుల ఏర్పాటుకు స్థలాల కేటాయించాలన్నారు. సబ్‌ డివిజన్‌ స్థాయి కమిటీ సమావేశంలో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీకి అందించిన అర్హుల జాబితాను జిల్లా స్థాయి సమావేశంలో ఆమోదించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వో రామచంద్రరావు, డీఆర్‌వో పి.కొండయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి దుర్గాబాయి, డీపీవో కేశవరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, డీఈవో గంగాభవాని, భూగర్భ జల వనరుల శాఖ డీడీ కే లక్ష్మి, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ మాధవి సుకన్య, గుంటూరు ఆర్‌డీవో భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.