Abn logo
Mar 6 2021 @ 02:03AM

పోలింగ్‌ రోజు జీతంతో కూడిన సెలవు

పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలకు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆదేశం

విశాఖపట్నం, మార్చి 5: జిల్లాలో విశాఖ కార్పొరేషన్‌, నర్సీపట్నం, యలమంచిలి పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నందున అన్ని సంస్థల ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈనెల 10వ తేదీన వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు.


ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 67 ప్రకారం అన్ని పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఏదైనా సెలవు రోజును పనిదినంగా మార్చుకోవచ్చని సూచించారు. సెలవు సాధ్యంకాని సంస్థలు తమ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మూడు గంటల సమయాన్ని ఇవ్వాలని ఆదేశించారు.


మద్యం దుకాణాల బంద్‌

ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కు ఒక రోజు ముందు నుంచి ముగిసే వరకు 48 గంటలపాటు, ఓట్ల లెక్కింపు రోజు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.  ఈనెల 8వ తేదీ సాయంత్రం నుంచి పోలింగ్‌ ముగిసే వరకు, ఓట్ల లెక్కింపు జరిగే 14వ తేదీన ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పారు.  

Advertisement
Advertisement
Advertisement