Abn logo
Jul 11 2020 @ 04:35AM

ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి : కలెక్టర్‌

వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, జులై 10:  వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజక వర్గాల పరిధిలో ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు అన్నారు.  ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, బల్దియా కమిషనర్‌ పమేల సత్పతితో కలిసి శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏడాది 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అంతకంటే ఎక్కువే నాటాలన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో మియావాకి యాదాద్రి మోడల్‌ మొక్కలు నాటిన నేపథ్యంలో లక్ష్యాన్ని సాఽధించవచ్చునన్నారు. తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ మాట్లాడుతూ నగరంలో కోతుల బెడద అధికంగా ఉన్నందున ఇప్పుడు ఉన్న మంకీ పుడ్‌ కోర్టులకంటే అదనంగా 30 పుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.  

Advertisement
Advertisement