Advertisement
Advertisement
Abn logo
Advertisement

దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన కలెక్టర్‌

నెల్లూరురూరల్‌, నవంబరు 27 :  ఇటీవల పోటెత్తిన వరదల తాకిడికి దెబ్బతిన్న రోడ్లను కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు పరిశీలించారు. నెల్లూరు - తాటిపర్తి రహదారిలో జొన్నవాడ మలుపు వద్ద పూర్తిగా దెబ్బతిన్న నరసింహపురం రోడ్డును కలెక్టర్‌ శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్షుణంగా పరిశీలించారు. జొన్నవాడ రేవు వద్ద దెబ్బతిన్న రహదారి కారణంగా ఏర్పడిన ఇబ్బందులు, నష్టం పై వివిధ శాఖల అధికారులతో ఆయన అంచనాలు తయారు చేయించారు. ప్రస్తుతం తాత్కాలికంగా రవాణ నడుస్తున్నా శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామన్నారు.

Advertisement
Advertisement