Abn logo
Oct 12 2020 @ 00:00AM

చిన్న నాటి ఫొటోలతో...

Kaakateeya

ఫొటో అల్బమ్‌లో తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీల చిన్నప్పటి ఫొటోలు చూసే ఉంటారు. వాటితో అందరినీ సర్‌ప్రైజ్‌ చేయాలని ఉందా? అయితే ఇలా చేయండి.


  1. కుటుంబ సభ్యుల పాత ఫొటోలు సేకరించండి. అల్బమ్స్‌లో వెతకండి. తాతయ్య ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన పాత ఫొటోలు తీసుకోండి.
  2. తాతయ్యల ఫొటోలు దొరకకపోతే అడగండి. చిన్నప్పటి ఫొటోలు ఏమైనా ఉన్నాయా అని అడిగి సేకరించండి.
  3. ఇప్పుడు ఒక తెల్లకాగితంపై కుటుంబసభ్యుల ఫొటోలు చిన్నగా కత్తిరించి అతికించండి. వంశవృక్షంలా గీసి అతికించవచ్చు. దానికి ఫ్రేమ్‌ కట్టించి ఇంట్లో వేలాడదీస్తే మిమ్మల్ని అభినందించకుండా ఉండలేరు.

Advertisement
Advertisement