Abn logo
Jun 4 2020 @ 03:51AM

చల్లగా తాకిన... నైరుతి

అమరావతి, విశాఖపట్నం, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు అండమాన్‌, నికోబార్‌ దీవులతోపాటు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం ఏపీలో ఎండ, వేడి గాలులు కాస్త తగ్గాయి. అనేకచోట్ల 32 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు ప్రాంతాల్లో  చెదురుమదురుగా జల్లులు పడ్డాయి. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగిన తీవ్ర తుఫాన్‌ ‘నిసర్గ’ బుధవారం మధ్యాహ్నం మహారాష్ట్రలోని అలిబాగ్‌కు దక్షిణాన తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర తుఫాన్‌ ఈశాన్యంగా పయనించి ఈ రాత్రికి  బలహీనపడుతుందని పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement