Abn logo
Sep 25 2021 @ 10:03AM

తగ్గుతున్న పాజిటివ్‌ కేసులు.. పెరుగుతున్న మృతులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటం ఓవైపు సంతోషం కలిగిస్తుండగా.. మరో వైపు ఇటీవల మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం 789 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా 23 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులలో బెంగళూరులో 285 మంది దక్షిణకన్నడలో 108 మంది, మైసూరు 71,  ఉడుపి 69 మంది కాగా 4 జిల్లాలో ఒక కేసు నమోదు కాలేదు. తాజాగా 1050 మంది డిశ్చార్చి కాగా ఏకంగా 23 మంది మృతిచెందారు. 30 జిల్లాల పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 13,306 మంది చికిత్సలు పొందుతున్నారు.