Abn logo
Jul 28 2021 @ 21:32PM

Olympics: అందరూ చూస్తుండగానే ఆ క్రీడాకారిణిని ఆమె కోచ్..

ఇంటర్నెట్ డెస్క్: పోటీల్లో విజయం సాధించాలంటే క్రీడాకారులకు శారీరక ధారుఢ్యంతో పాటూ మానసిక ధృఢత్వం కూడా ముఖ్యమే.  ఆట ముగిసే వరకు.. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా క్రీడాకారులు తమ ఉత్సాహాన్ని కోల్పోకూడదు. అప్పుడే విజయం వరిస్తుంది. ఇక ఒలింపిక్స్ లాంటి ప్రపంచస్థాయి పోటీల్లో అథ్లెట్లపై ఉండే అంచనాలు, ఒత్తిడి ఎవరూ ఊహించలేని స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులు తమకు ఉత్సాహాన్నిచ్చే, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అనేక పనులు చేస్తుంటారు. కొందరు తమ ఇష్టదైవాన్ని తలుచుకుంటే మరికొందరు అదృష్టాన్ని ఇచ్చే ఉంగరమో లేదా మరోకటో ధరిస్తుంటారు.

ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే..టోక్యో ఒలింపిక్స్‌లో ఇటీవల నమ్మశక్యం కానీ ఓ ఘటన చోటుచేసుకుంది. జర్మనీ జూడో క్రీడాకారిణి మార్టీనా ట్రాజ్‌డోస్‌ను ఆమె కొచ్ అందరూ చూస్తుండగానే చెంప ఛెళ్లుమనిపించాడు. అంతకుమనుపు..ఆమె భుజాలు పట్టుకుని ఊపేసిన అతడు..ఆ తరువాత చుట్టూ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా ఊచిపెట్టి ఒక్కటిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. దీంతో.. మార్టినా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పోటీకి ముందు తనలో స్ఫూర్తి, దూకుడును రగిలించేందుకు తన చెంపఛెళ్లుమనిపించమని తానే కోచ్‌ను కోరానని తెలిపింది.

ప్రత్యేకంమరిన్ని...