Abn logo
Aug 6 2020 @ 00:30AM

ప్రశాంతంగా కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక

ఘట్‌కేసర్‌/కీసర రూరల్‌/మేడ్చల్‌ : ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముల్లి పావని అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. 18 మంది కౌన్సిలర్లు ఉన్న ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో అనుభవ కేటగిరిలో బొక్క సురేందర్‌రెడ్డి, పల్లె అరుణ, మైనార్టీ కేటగిరిలో ఎస్‌కే షౌకత్‌ మియా, బొట్టు అరుణలను ఎంపిక చేశారు. చైర్‌పర్సన్‌ పావని, వైస్‌ చైర్మన్‌ మాధవరెడ్డి, బండారి శ్రీనివా్‌సగౌడ్‌ మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు   కోఆప్షన్‌ సభ్యుల ఎంపికను పూర్తి చేశారు. అనంతరం ఎంపికైన సభ్యులను సహకార సంఘం చైర్మన్‌ సింగిరెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి దాసుగౌడ్‌, ముల్లి జంగయ్య యాదవ్‌, మేకల నర్సింగ్‌రావు, బిక్షపతి, కార్యకర్తలు అభినందించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. నలుగురిని కో-ఆప్షన్‌ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


జనరల్‌ నుంచి కందాడి చెన్నారెడ్డి, వడియాల రజిని, మైనార్టీ విభాగం నుంచి వహీదాబేగం, షేక్‌ షాదుల్‌ నియమితులయ్యారు. ఎన్నికైన సభ్యలను చైర్‌పర్సన్‌ ప్రణీత, వైస్‌చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, కమిషనర్‌, కౌన్సిలర్లు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ వెంకట్రాం పాల్గొన్నారు. మేడ్చల్‌ మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్‌ మర్రి దీపికానర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లతో పాటు 19 మంది కౌన్సిలర్లు కలిసి కో-ఆప్షన్‌ సభ్యులుగా గీత, నవీన్‌రెడ్డి, జఫ్రీన్‌, మహమ్మత్‌ అలీలను ఎన్నుకున్నారు. అనంతరం వారిని సత్కరించి అభినందనలు తెలియజేశారు.


పట్నం మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

ఇబ్రహీంపట్నం/షాద్‌నగర్‌: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బుధవారం కమిషనర్‌ వి.శ్యాంసుందర్‌ ప్రకటించారు. ప్రత్యేక అనుభవ సభ్యులుగా టేకుల రాంరెడ్డి, గుంటి శకుంతల, మైనార్టీ కోటా నుంచి సయ్యద్‌ ముబీన్‌, ఎండీ శహనాజ్‌బేగం ఎన్నికయ్యారన్నారు. 24 మంది సభ్యులకు గాను చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి సహా టీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది సభ్యులు ఎన్నికలో పాల్గొన్నారు. ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యులు, ఇద్దరు బీజేపీ సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు. అనంతరం నూతనంగా సభ్యులను టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. కాగా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో కో-ఆప్షన్‌ సభ్యులను ఈనెల 7న ఎన్నుకోనున్నట్లు కమిషనర్‌ లావణ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.

Advertisement
Advertisement