Abn logo
Sep 20 2021 @ 20:12PM

ఇక... కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు

ముంబై : వీసా ప్లాట్‌ఫామ్‌లో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేటీఎంతో కలిసి పని చేస్తుందని బ్యాంకు వెల్లడించింది. పేటీఎం... అతి పెద్ద కస్టమర్ బేస్‌ను కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఇది 330 మిలియన్ల మందికి సేవలనందిస్తోంది. తద్వారా టైర్ II, III నగరాలకు డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులను విస్తరించింది.


క్రెడిట్ కార్డులు, నెలవారీ వాయిదాలు, ఆయా కొనుగోళ్ళ  తర్వాత పేమెంట్స్ ఆప్షన్స్, ఉత్పత్తుల పూర్తి సూట్ కోసం పండుగ సీజన్‌లో పేటీఎం క్రెడిట్ కార్డులను అక్టోబర్‌లో ప్రారంభించనుంది. వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి రివార్డులు, క్యాష్‌ బ్యాక్ అందిస్తాయని బ్యాంక్ పేర్కొంది. కొత్త కార్డుల ఆఫర్ చిన్న వ్యాపార యజమానులకు కూడా వెసులుబాటుగా ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలో... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పేటీఎం బిజినెస్ క్రెడిట్ కార్డులు జారీ కానున్నాయి.