Abn logo
May 21 2020 @ 03:57AM

లాభాలు కలిగించడమే సీఎం ఉద్దేశం

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : రైతులకు లాభం చేకూర్చడమే సీఎం కేసీఆర్‌ ఉద్దేశ్యమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. వానాకాలం వ్యవసాయ కార్యాచరణ ప్రణాళి క-2020, నూతన సాగు విధానంపై వ్యవసాయ శాఖ ఆధ్వ ర్యంలో బుధవారం మహబూబ్‌నగర్‌లోని జడ్పీలో నిర్వహిం చిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు డిమాండ్‌ ఉన్న పంటలే పండించాలని సూచించా రు.


విత్తనాలు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, రైతు లెవరూ ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద విత్తనాలు కొని మోసపోవ ద్దని చెప్పారు. మహబూబ్‌నగర్‌, నారాయణఫేట జిల్లాలను వ్యవసాయంలో నంబర్‌ వన్‌గా నిలపాలని, ఇందుకు అంద రూ సహకరించాలని మంత్రి కోరారు. ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, జ డ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, కలెక్టర్లు ఎస్‌.వెంకట్రావు, హరిచందన పలు అంశాలపై మాట్లాడి, వ్యవసాయాధికారు లు, రైతుబంధు సమితి సభ్యులకు సూచనలందించారు. నా రాయణపేట జడ్పీచైర్‌పర్సన్‌ వనజ, అదనపు కలెక్టర్‌ సీతారా మారావు, డీఏవో ఇన్‌చార్జి హుక్యానాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement