Abn logo
Jan 21 2021 @ 13:16PM

జగన్ లాంటి సీఎం మళ్లీ రాడు: మంత్రి కన్నబాబు

మంత్రి కన్నబాబు  


విశాఖపట్నం: వైయస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి మళ్లీ రాడని, పుట్టబోడని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ఇంటింటికి రేషన్ బియ్యం అందించే కార్యక్రమాన్ని గురువారం కన్నబాబు ఇక్కడ ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఈ అద్భుతమైన ఇంటింటికి రేషన్ బియ్యం, సరుకులు అందించే కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ఈ పథకం ద్వారా నాణ్యమైన బియ్యం, సరకులు ఇంటివద్దే అందించే కార్యక్రమం దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు.


తన తండ్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే జగన్ నడుస్తున్నాడని ఆయన ప్రశంసించారు. ఈ పథకం రూపొందించడం చాలా గొప్ప విషయమన్నారు. రేషన్ షాపునకు వెళ్లలేని వికలాంగులు, వృద్దులకు ఈ పథకం చాలా ఉపయోగపడుతోందన్నారు. అంతేకాకుండా నిరుపేదలకు రవాణా ఖర్చులు కూడా మిగులుతాయన్నారు. పేద ప్రజల కోసం సీఎం జగన్  అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని కన్నబాబు పేర్కొన్నారు.

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతుంటే టీడీపీ బ్యాచ్ కడుపు మండుతోందన్నారు. చంద్రబాబు, టీడీపీ  తాబేదార్లు ఇంత మంచి పథకం పై కూడా విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు తన పాలనలో ఏనాడైనా ఇటువంటి మంచి పథకాలు ప్రవేశపెట్టాడా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. 

Advertisement
Advertisement
Advertisement