Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాసేపట్లో మంత్రులతో సీఎం KCR భేటీ

హైదరాబాద్:  ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో మంత్రులతో అత్యవసరంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం ఖరారు చేయనున్నారు. ఈనెల 23న  నామినేషన్ల గడువు ముగియనుంది. 10న పోలింగ్ జరుగనుండగా...14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 12 మంది సిట్టింగుల్లో చాలా మందిని మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు టిక్కెట్ కోసం పెద్ద ఎత్తున ఆశావహుల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ -2‌, మహబూబ్‌నగర్ - 2‌, రంగారెడ్డి జిల్లాల్లో - 2 స్థానాలు, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిలాల్లో ఒక్కో స్థానం, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 

Advertisement
Advertisement