Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలి: సీఎం జగన్

అమరావతి: ఓటీఎస్‌పై జరుగుతున్న ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులకు సీఎం జగన్ సూచించారు. అలాగే జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌) పై జరుగుతున్న ప్రచారంపై కఠినంగా ఉండాలన్నారు. ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందన్నారు. ఈ పథకంపట్ల ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలన్నారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్‌ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలను కూడా చూపించాలన్నారు.  

Advertisement
Advertisement