Abn logo
Sep 27 2020 @ 02:59AM

సీఎం గారూ..! పేదలను ఆదుకోండి

మాఫియాను కట్టడి చేయండి: సోమిశెట్టి 


కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు:  సీఎం జగన్‌కు చేతులు జోడించి మొక్కుతున్నానని, పేదలను ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని కోరారు. వైసీపీ నాయకులు ఇసుక, లిక్కర్‌, పేకాటతో రూ.లక్షలు వెనక్కేసుకుంటున్నారని, పేద ప్రజలు పస్తులుంటే ఎందుకు దయ చూపడం లేదని ప్రశ్నించారు. కరోనాను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement
Advertisement