Abn logo
Oct 24 2020 @ 16:03PM

మరికాసేపట్లో పోలవరంపై సీఎం జగన్ సమీక్ష

Kaakateeya

అమరావతి: మరికాసేపట్లో పోలవరంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్, ఇతర అధికారులు హాజరు కానున్నారు. పోలవరం అంశంలో కేంద్ర ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. చంద్రబాబు హయాంలో కేంద్రం 55 వేల కోట్లకు అంగీకరించి ఇప్పుడు మాట మార్చడంపై చర్చ జరగనుంది.

జగన్ సర్కార్‌కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న పోలవరం అంచనా వ్యయాన్ని 2013-14లో తెలిపినట్లుగా 20,398.61 కోట్లకే పరిమితం చేయడం పైనే ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. 2013లో వచ్చిన కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పరిహారం ఖర్చు భారీగా పెరగడంతో... ప్రాజెక్టు తుది అంచనా వ్యయం 55,548.87 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2019 ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ కూడా ఇందుకు అంగీకరించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ఫైలును పరిశీలించిన కేంద్ర ఆర్థిక శాఖ 47,725.24 కోట్లకు ఆమోదం తెలిపింది. భూసేకరణ వ్యయాన్ని కుదిస్తూ గత ఏడాది జూలైలో కేంద్రం నిర్ణయం తీసుకుంది.  

Advertisement
Advertisement