Abn logo
Sep 21 2020 @ 20:41PM

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్.. ఇంత సడన్‌గా ఇందుకేనా..?

Kaakateeya

రేపు సీఎం జగన్ హస్తిన టూర్

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం 3 గంటలకు జగన్ హస్తినకు బయల్దేరనున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్షవర్ధన్‌ను జగన్ కలిసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నట్లు తెలిసింది.


ఏపీలో ఇటీవల దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం, అన్యమతస్థులకు డిక్లరేషన్‌ అవసరం లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన వివాదాస్పదం కావడం.. తదనంతరం మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో ఏపీలో హిందూ సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ బీజేపీ జగన్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా.. సీఎం జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు.

Advertisement
Advertisement
Advertisement