Abn logo
Dec 2 2020 @ 16:04PM

కావాలని అడ్డుపడుతున్నారు: సీఎం జగన్

అమరావతి: చంద్రబాబు ఉన్న చోట దిగజారిన రాజకీయాలు కనిపిస్తాయని సీఎం జగన్‌ విమర్శించారు. పోలవరం రాష్ట్రానికే ఒక వరమన్నారు. గత సీఎంలు పోలవరాన్ని పూర్తి చేయాలనుకోలేదని చెప్పారు. చంద్రబాబు ఏనాడూ పోలవరం గురించి ఆలోచన చేయలేదని సీఎం పేర్కొన్నారు. 2004లో వైఎస్‌ సీఎం అయ్యాక 86 శాతం భూసేకరణ చేసి కుడి కాలువ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారని గుర్తుచేశారు. అసెంబ్లీలో చర్చ జరగకుండా కావాలని అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు జరిగాయన్నారు. పోలవరం కోసం వైఎస్‌ అన్ని క్లియరెన్స్‌లు తెచ్చారని గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాకముందు వరకు 29.80శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని సీఎం చెప్పారు. రివర్స్‌  టెండరింగ్‌లో రూ.1,343 కోట్లు ఆదా అయిందన్నారు.

Advertisement
Advertisement
Advertisement