Abn logo
Oct 16 2020 @ 01:03AM

పేదలకు అండగా సీఎం సహాయనిధి

ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి


ఇబ్రహీంపట్నం రూరల్‌ : నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధి తుర్కగూడ గ్రామానికి చెందిన మంద ప్రణయ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.1.50లక్షల ఎల్‌వోసీని బాధిత తండ్రి మంద బుగ్గయ్యకు  క్యాంపు కార్యాలయంలో అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, సర్పంచ్‌ పవిత్రకుమార్‌, ఉపసర్పంచ్‌ ఏనుగు నరేందర్‌రెడ్డి, జెర్కోని రాజు, నిట్టు జగదీశ్వర్‌ పాల్గొన్నారు.


ప్రజాభీష్టానికనుగుణంగా పథకాలు

తలకొండపల్లి : ప్రజాభీష్టానికనుగుణంగా ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఖానాపూర్‌కు చెందిన ఎస్‌.బాలమణికి రూ.31వేలు, డి.యాదగిరికి రూ.48 వేలు, వెల్జాలకు చెందిన ఎల్లమ్మ కు రూ.18 వేలు, తుపాకుల అజయ్‌కి రూ.16 వేలు, వెంకటాపూర్‌నకు చెందిన సీహెచ్‌.శ్రీనివా్‌సకు రూ.23 వేలు, వెల్దండకు చెందిన మాస్టర్‌ దీపక్‌రెడ్డికి రూ.20 వేలు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. గురువారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో వెంకటాపూర్‌ సర్పంచ్‌ రమేశ్‌యాదవ్‌, సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గూడూరు భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement