Abn logo
Sep 13 2021 @ 15:20PM

గణేష్ శోభాయాత్రలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ

అనంతపురం: జిల్లాలో గణేష్ శోభాయాత్రలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది. కూడేరు మండలం, ఉదిరిపికొండ తండాలో వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

క్రైమ్ మరిన్ని...