Abn logo
Aug 1 2021 @ 00:28AM

రేషన్‌ దుకాణాల తనిఖీలు

రేషన్‌ దుకాణం తనిఖీ చేస్తున్న ఏఎస్‌వో-2 పరుచూరి కోమలి పద్మ

రేషన్‌ దుకాణాల  తనిఖీలు

మొగల్రాజపురం, జూలై 31: సర్కిల్‌-2 పరిధిలో రేషన్‌ దుకాణాలను సర్కిల్‌-2 ఏఎస్‌వో పరుచూరి కోమలి పద్మ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. సత్యనారాయణపురంలో రెండు, క్రీస్తురాజపురంలో రెండు రేషన్‌ దుకాణాలకు వెళ్లారు. జూలైకు సంబంధించి 20వ  తేదీ నుంచి రేషన్‌ దుకాణాలలో ఇస్తున్న పీఎంజీకేఏవై బియ్యం పంపిణీ శాతం తగ్గిన దుకాణాలలో తనిఖీ చేశారు. పంపిణీ పర్సంటేజీ గురించి రేషన్‌ దుకాణాలను పర్యవేక్షించే వీఆర్‌వోలు, సచివాలయ సిబ్బందిని కారణాలు ఆడిగారు.  సరుకు నిల్వలను, ఈ పోస్‌లో ఉన్న నిల్వలతో పోల్చి చూశారు. ఆగస్టులో పంపిణీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సార్టెక్స్‌ బియ్యం, కందిపుప్పు, పంచదార దుకాణాలకు చేరాయా లేదా అని చూశారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేషన్‌ దుకాణాలను పరిశుభ్రంగా ఉంచాలని, కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఎండీయూలు, డీలర్లు సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని సమర్ధంగా చేయాలని చెప్పారు. చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లలిత పాల్గొన్నారు.