Abn logo
Aug 8 2020 @ 20:14PM

టిక్‌టాక్ డేటాను చైనా దొంగిలించట్లేదంటూ.. సీఐఏ రిపోర్ట్?

వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా వేదిక టిక్‌టాక్ డేటాను చైనా యాక్సెస్ చేస్తోందని, ఈ యాప్‌తో ఎన్నో రహస్యాలను దోచేస్తోందని అమెరికా చాలాసార్లు ఆరోపించింది. ఈ కారణం చూపించి దేశంలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేసింది. అయితే ఈ ఆరోపణలు అవాస్తవాలంటూ ప్రస్తుతం ఓ వార్త యూఎస్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు ఓ ప్రముఖ వార్తాసంస్థ కథనం వెలువడింది. అమెరికా నేర పరిశోధనాసంస్థ సీఐఏ(సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అనలిస్టులు చేసిన పరిశోధనలో ఈ విషయం తేలిందట. దీన్ని వారు వైట్‌హౌస్ వర్గాలకు పంపారని ఆ వార్తా కథనం పేర్కొంది. అయితే యాప్ డేటాను యాక్సెస్ చేయాలన్నా, దొంగిలించాలన్నా చైనా అధికారుల వల్ల అవుతుందని సదరు వార్తాసంస్థ ప్రచురించింది.

Advertisement
Advertisement
Advertisement