Abn logo
Sep 20 2021 @ 21:01PM

జీవితంలో అతిపెద్ద సవాలను ఎదుర్కొన్నా: Chris Cairns

క్రైస్ట్‌చర్చ్: ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ (51) సోమవారం ఓ వీడియో ద్వారా తాను ఎదుర్కొన్న భయంకర పరిస్థితులను వివరించాడు. కెయిన్స్‌కు గత నెలలో గుండె ఆపరేషన్ జరిగింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అత్యవసర ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ చేస్తున్న సమయంలో కెయిన్స్‌కు స్టోక్ రావడంతో పక్షవాతానికి గురయ్యాడు. ఇదే విషయాన్ని తాజాగా తన వీడియోలో ప్రస్తావించాడు. జీవితంలో తాను ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇదేనని పేర్కొన్నాడు. తనను కాపాడిన సర్జన్లు, వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు పేర్కొన్నాడు. 


1989-2004 మధ్య న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన కెయిన్స్ 62 టెస్టులు ఆడాడు. బౌలింగులో 29.4, బ్యాటింగులో 33.53 సగటు సాధించాడు. ఇందులో 87 సిక్సర్లు కూడా ఉన్నాయి. అప్పట్లో ఇదొక ప్రపంచ రికార్డు. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆ ఇమేజ్ దెబ్బతింది. ఆ తర్వాత ఆ కేసుల నుంచి కెయిన్స్ బయటపడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.