కర్నూలు, డిసెంబరు 1: నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగిన ఓ దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలివి.. ఓల్డ్ ఈద్గా వద్ద ఉన్న స్టేట్ బ్యాంకుకు మైమూన్ అనే మహిళ తనదగ్గర ఉన్న బంగారు నగలను బ్యాగులో ఉంచుకుని బ్యాంకుకు వెళ్లింది. కొద్దిసేపటికి బ్యాగులో ఉన్న బంగారు నగలు చోరీకి గురైనట్లు పోలీసులను ఆశ్రయించింది. బ్యాం కులో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసిన వ్యక్తి షేక్ ఖాజాబిగా గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి 5 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.