Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిత్తూరు రోడ్డు ప్రమాదంలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

చిత్తూరు: జిల్లాలోని రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. అతివేగంగాడివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు కారులో మంటలు చేలరేగాయి. చిన్నారి సహా ఐదుగురు సజీవదహనమైయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. రుయా ఆస్పత్రిలో మరో మహిళ, ఐదేళ్ల చిన్నారి చికిత్స పొందుతున్నారు. మృతులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాసులుగా గుర్తించారు. చంద్రగిరి మండలం అగరాల దగ్గర ఘటనచోటుచేసుకుంది. ఘటనాస్థలిని ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీ నరసప్ప పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 


Advertisement
Advertisement